Medak Church | మెదక్ మున్సిపాలిటీ, మే 18 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు.
చర్చి ప్రెసిబేటరీ ఇంచార్జీ శాంతయ్య, పాస్టర్లు శ్రీనివాస్, జైపాల్, డేవిడ్‌లు భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. ఈ సందర్బంగా భక్తులు వసతి గృహాలతోపాటు చర్చి ఆవరణలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సువన్డగ్లస్, నోబుల్సన్, సంశాన్ సందీప్, ప్రాంక్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్