Edupayala | పాపన్నపేట, మార్చి 23 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో ఇవాళ పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో సుధీర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు , బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ సిబ్బంది శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, మధుసూదన్ రెడ్డి, బత్తిని, నర్సింలు, రాజు, వరుణాచారి, తదితరులు ఏర్పాటు చేయగా వేదపండితులు శంకర శర్మ, పార్థివ శర్మ ,రాము శర్మ, నాగరాజు శర్మ తదితరులు పూజలు నిర్వహించారు.
ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ చర్యలు చేపట్టారు.
Read Also :
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు