DEE CET | మెదక్ మున్సిపాలిటీ, జూన్ 7 : డీ సెట్-2025లో ఉతీర్ణత సాధించిన వారు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, డీపీఎస్ఈ మాధ్యమాల్లో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ నుండి 13 వరకు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు డాక్టర్ రాధాకిషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, పదో తరగతి, ఇంటర్ మెమోలతోపాటు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బొనాఫైడ్, కులం, ఆదాయం, నివాసం, టీసీలతో హాజరు కావాలన్నారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ అభ్యర్థులు, దివ్యాంగ అభ్యర్థులు సంబంధిత దృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. 9వ తేదిన క్రమసంఖ్య 1 నుంచి 500 వరకు, 10వ తేదీన 501 నుండి 1000 వరకు, 11వ తేదీన 1001 నుండి 1500 వరకు, 12న 1501 నుండి 2000 వరకు, 13వ తేదీన 2001 నుండి 2198 వరకు రావాలని తెలిపారు.
ఏవైనా సందేహాలు ఉంటే 9949993717, 9397682345, 9701767857 నంబర్లను సంప్రదించాలని డాక్టర్ రాధాకిషన్ సూచించారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు