Students | శివ్వంపేట, మార్చి 16 : మండల కేంద్రమైన శివ్వంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఇద్దరు స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు వచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డిల ముందే డప్పుకొట్టారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు విద్యార్థులకు నోట్లో డబ్బులు పెట్టి మరీ డప్పులు కొట్టించారు.
డప్పుకొట్టిన వారిలో ఓ విద్యార్థి 8వ తరగతి, మరో విద్యార్థి 10వ తరగతి చదువుతున్నారు. చదువుకునే విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలను వినియోగించుకోవడం పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రమణాగౌడ్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు స్కూలుకు వెళ్లే విద్యార్థులను రాజకీయ కార్యక్రమానికి తీసుకువచ్చి ఎలా డప్పుకొట్టిస్తారని మండిపడ్డారు.
ఇది బాలల హక్కుల ఉల్లంఘన అవుతుందని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీసే చర్య అన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులతో రాజకీయ కార్యక్రమానికి డప్పుకొట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also :
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు