BJP Party | చిలిపిచెడ్, సెప్టెంబర్ 14 : చిలిపిచెడ్ మండలంలో ‘సేవా పక్షం’ మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు మల్కని నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతాపార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ సాదుల మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, కుల వృత్తుల వారిని, విశ్వబ్రాహ్మణులను సన్మానించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో, పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు నిర్దేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ , మాజీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోర్పోల్ సత్యనారాయణ, లస్కరి వెంకటేశం, మండల ఉపాధ్యక్షుడు సాకలి రామకృష్ణ, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు చంద్రారెడ్డి, రాజా గౌడ్, రమేష్, మండల బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, జోగయ్య, సోమశేఖర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!