మూడోరోజూ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో జోరుమీదున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ విదేశీ మదుపర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి.
- 78 వేల పాయింట్లపైకి సెన్సెక్స్
ముంబై, జూలై 31: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో జోరుమీదున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ విదేశీ మదుపర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారాంతపు ట్రేడింగ్‌లో ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 166.49 పాయింట్లు అందుకొని తిరిగి 78 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు 78,094.64 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 66.45 పాయింట్లు అందుకొని 24,383.60 వద్ద స్థిరపడింది. సూచీల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతున్నదని, పెరిగిన రాబడులు, వడ్డీరేట్ల పెంపుపై ఉన్న ఆందోళన నేపథ్యంలో మదుపర్లలో జాగ్రత్తకొనసాగినప్పటికీ, సానుకూల వృద్ధి కొనసాగిందని..ఈ పునరుద్ధరణ స్థిరత్వం ప్రధానంగా, ప్రస్తుత అంచనాలను మించి రాణిస్తున్న ప్రస్తుత ఆదాయాల సీజన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇటీవల కాలంలో భారీగా లాభపడిన ఐటీ రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందన్నారు.
- బజాజ్ ఫైనాన్స్ షేరు 8.11 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు బజాజ్‌ఫిన్‌సర్వ్ కూడా 6.30 శాతం బలపడింది.
- అలాగే మహీంద్రా 3.58 శాతం, అదానీపోర్ట్స్ 2.12 శాతం, టాటాస్టీల్, రిలయన్స్‌లు ఒక్క శాతానికి పైగా పెరిగాయి.
- వీటితోపాటు భారతీ ఎయిర్టెల్, బీఈఎల్, ఎన్టీపీసీ, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, కొటక్ బ్యాంక్, ట్రెంట్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- కానీ, టీసీఎస్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఇండిగో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్‌మహీంద్రా షేర్లు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి.
- సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు పతనం చెందాయి.
- రంగాల్లో ఆటో సూచీ 1.99 శాతం లాభపడగా, క్యాపిటల్ గూడ్స్ 1.78 శాతం, పవర్ 1.26 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.01 శాతం, టెలికాం, యుటిలిటీస్, సర్వీసెస్ సూచీలకు మదుపర్ల నుంచి మద్దతు లభించింది.
- కానీ ఐటీ సూచీ 1.39 శాతం కోల్పోగా..ఫోకస్డ్ ఐటీ 1.21 శాతం, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్య, ప్రైవేట్ బ్యాంకింగ్ సూచీలు నష్టపోయాయి.
- ఈవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,034.87 పాయింట్లు లేదా 2.67 శాతం, నిఫ్టీ 616.15 పాయింట్లు లేదా 2.59 శాతం ఎగబాకాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

