Salaries | మెదక్ రూరల్, సెప్టెంబర్ 27 : బతుకమ్మ, దసరా పండుగలు దగ్గర పండుతుండగా ఎంపీడీవో కార్యాలయంలో వర్క్ చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు , గ్రామ పంచాయతీ కార్మికులు, ఈజీఎస్ ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. మెదక్, హవేలీ ఘనపూర్ పంచాయతీల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు, ఈజీఎస్ ఉద్యోగులు, సిబ్బంది, గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లు కార్మికులు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడు నెలలకు వరకు జీతాలు రాకపోవడంతో కార్మికులకు రోజు వారీ జీవనం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది తక్కువ వేతనంతో పని చేస్తూ ఆలస్యంగా రావడం వల్ల తెలంగాణలో అతి పెద్ద పండుగలు బతుకమ్మ, దసరాకు వేతనాలు రాకపోవడంతో పండుగలు జరుపుకోవడమే కష్టమవుతుందన్నారు.
కొత్త దుస్తులు కొనడానికి కూడా డబ్బులు లేవని అప్పు కూడా దొరకడం లేదని వాపోయారు. ప్రజల అవసరాలకు తోడ్పడే పంచాయతీ కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా జీతాలు లేవు : రాజు
మేము నిరంతరం గ్రామ పరిశుభ్రతలో భాగస్వామ్యం అవుతున్నాం. ప్రస్తుతం మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. పండుగ వరకు జీతాలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి