Bike Parking | మునిపల్లి, సెప్టెంబర్ 25 : ఆయన ఓ ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్.. రోజూ కార్యాలయానికి బైక్‌పై వస్తాడు. ఆఫీస్‌కు రాగానే తను పని చేసే కంప్యూటర్ గదిలోకి వెళ్తాడు. ఆసక్తికర విషయమేంటంటే ఆయనతోపాటే బైకు కూడా ఆఫీస్‌లోకి వెళ్తుంది. అదేంటి అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే. సదరు కంప్యూటర్ ఆపరేటర్‌కు ఆఫీస్ బయట ఎంత స్థలం ఉన్నా తన బైక్‌ను అక్కడ పార్కింగ్ చేయాలనిపించదో..? లేదో తెలియదు.. కానీ అతను మాత్రం ఆ బైక్‌ను తను పనిచేసుకునే కంప్యూటర్ రూం పక్కనే పార్కింగ్ చేస్తాడు..
ఈ విషయం తెలిసిన పలువురు స్థానికులు సంబంధిత అధికారుల వ్యవహారశైలిపై మండి పడుతున్నారు. తరచూ ఇలాగే చేస్తున్నా కంప్యూటర్ ఆపరేటర్ పక్కనే కూర్చొని విధులు నిర్వహించే ఏపీఓ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఏంటని పలువురు మునిపల్లి వాసులు ఏపీఓపై తీవ్రంగా మండిపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న మునిపల్లి ఏపీఓపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వారి సొంత వాహనాలను ఇంటి వద్ద పార్కింగ్ చేసినట్టు ఆఫీస్ వరండాలో పార్కింగ్ చెయ్యడం ఏంటి ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు అధికారులు కార్యాలయానికి తీసుకువచ్చే తమ బ్యాటరీ వాహనాలకు ప్రభుత్వ కార్యాలయంలోనే ఛార్జింగ్ సైతం పెట్టుకుంటున్నారేమో అనే అనుమానాలకు దారి తీస్తుంది. ప్రభుత్వ కార్యాలయంలో వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకొని ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారేమోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సిబ్బందికి వత్తాసు పలికే అధికారిపై చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.
Woman Molest | వివాహితపై పోలీసుల అఘాయిత్యం.. కేసు నమోదు
Mulugu | ములుగు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం..
KCR | కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు : కేసీఆర్