Yoga | రామాయంపేట, జూన్ 08 : మానవ జీవితానికి యోగా పరిపూర్ణమైందని.. అందుకోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ రోజుకు గంటనైనా యోగాసనాలు చేయాలని రామాయంపేట యోగా శిక్షకులు మద్దెల భరత్ పేర్కొన్నారు.
ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని ఇంటింటికి, దుకాణాదారుల వద్దకు వెళ్లి ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో యోగా ఆసనాలపై అవగాహన కల్పించారు.
యోగా చేయడం కోసం చిన్నారుల నుండి సుమారు 50 నుండి 60 ఏళ్ల వయస్సు వారు కూడా తమ ఆరోగ్యం కోసం ప్రతి రోజూ యోగాసనాలను చేయాలన్నారు. యోగా ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు.
బీపీ, షుగర్, కీళ్ల, కాళ్ల నొప్పులు తదితర వ్యాధులకు యోగా అసలైన వ్యాయామం అన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు భరత్‌ను పట్టణవాసులు అభినందించారు. దైనందిన జీవితంలో యోగాను ఉచితంగా నేర్పించడం గర్వకారణమని.. భరత్ సేవలను బొద్దుల సాగర్, స్వామి, వెంకటసాయి, సాయి, కృష్ణ, రాజు తదితరులు అభినందించారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి