Collector RahulRaj | సర్పంచులు గ్రూప్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి.. శిక్షణలో కలెక్టర్ రాహుల్ రాజ్
Collector RahulRaj | పాపన్నపేట,నర్సింగి,మెదక్ ,హవేలీఘనాపూర్ (4 ) మండలం లోని దాదాపు 100 మంది సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు లె క్టర్ రాహుల్ రాజ్.
Collector RahulRaj | మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికిమెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ..ఈ శిక్షణ కార్యక్రమం పాపన్నపేట,నర్సింగి,మెదక్ ,హవేలీఘనాపూర్ (4 ) మండలం లోని దాదాపు 100 మంది సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు.
సర్పంచులు గ్రూప్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి..
పంచాయతీ రాజ్ చట్టంలోని గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి పథకాలు వంటి విపత్తుల సమయంలో సర్పంచ్ ల పాత్ర, డిజిటల్ సైన్, ఆదర్శ గ్రామపంచాయతీ ల నిర్మాణం తదితర అంశాలపై సర్పంచ్ల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పంచాయతీ రాజ్ చట్టంలోని ప్రతీ అంశాన్ని సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్య, వైద్యం నిరుపేదలకు అందేలా సర్పంచ్ లు కృషి చేయాలన్నారు.
మానవత్వ కోణంలో పని చేయాలని సూచిస్తూ.. డిజిటల్ గవర్ననెన్స్కు దోహద పడాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, మోరల్ స్కిల్స్, తదితర అంశాల పైన కూడా సర్పంచులు అవగాహన ఉండాలన్నారు. గ్రామాల్లోని సర్పంచులు గ్రూప్ రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, నిరుపేదల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యం అవుతుందని,గ్రామం అంటేనే స్వచ్చమైన వాతావరణం అని వివరించారు.
గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలకు అతీతంగా మంచి-చెడుల న్యాయ నిర్ణేత సర్పంచేనని అన్నారు. వార్డులలో ఓటు వేసిన వారిని…ఓటు వేయని వారిని ప్రభుత్వ పథకాల్లో సమాన స్థాయిలో చూడాలన్నారు. కుల ,మత ,జాతి రాగద్వేశాలు ఉండొద్దు అని,బాల్య వివాహాలు,బాల కార్మిక వ్యవస్థ,కుల నిర్మూలన,మూఢనమ్మకాల నిర్మూలనలో సర్పంచ్ లదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని, రోడ్డు నిర్మాణాలు ఇతర గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ పడాలన్నారు. గ్రామాల్లో ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులమీద కావని స్వతంత్రంగా గుర్తులు కేటాయిపు ద్వారా జరగడం గ్రామాల్లో రాజకీయాలు ,గ్రూప్ తగాదాలు లేకుండా చూడడమే అన్నారు చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు.
సీజనల్ అంటూ వ్యాధుల రాకుండా..
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, సామాజిక అభివృద్ధి సాధించేలా చూడాలన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు ఉపయోగించాలన్నారు. మరుగు దొడ్లు లేకపోతే కట్టించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్త సేకరణ,పిచ్చి మొక్కల తొలగింపు,వర్షాకాలంలో నీటి నిల్వ తొలగింపు, సీజనల్ అంటూ వ్యాధుల రాకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలన్ని సర్పంచులు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ పి రవీందర్, డి పి వో యాదయ్య, జెడ్పి సీఈఓ ఎల్లయ్య డిఆర్డిఓ శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్ లు డి ఎల్పీవో సురేష్, సాయిబాబా, ఎంపీడీఓలు చిన్నారెడ్డి, షాజీవోధీన్, తిరుపతి రెడ్డి, మోజామ్, మహిపాల్ రెడ్డి, ముజీబ్, సర్పంచులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్కు సిద్ధమైన బ్లాక్బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

