Collector Rahul Raj | మెదక్, ఏప్రిల్ 15 : భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. ఇవాళ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భూభారతి చట్టం, జిల్లాలో ధాన్యం కొనుగోలు నిర్వహణ తీరుపై అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతిలో.. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజ్రిస్టేషన్, మ్యుటేషన్ చేసేందుకుగాను ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, మొదలగునవి భూ భారతిలో కీలక అంశాలని వెల్లడించారు.
ఈ చట్టంపై ప్రతీ రోజు రెండు మండలాల చొప్పున ఉదయం, మధ్యాహ్నం సమయంలో 6 రోజుల్లో జిల్లాలో గల 12 మండలాల్లో అవగాహన సదస్సులను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సదస్సులలో ప్రజలకు ఈ చట్టంపై నిశితంగా అవగాహన కల్పించాలన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, వకీలు, రైతు సంఘాల నాయకులు, సభ్యులను కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం చేయాలని, చట్టంలో ఉన్న ప్రాధాన్యత అంశాల వివరాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా కరప్రతంపై ముద్రించాలన్నారు.
ఏ సమస్యకి ఎలా అప్పీల్ చేసుకోవాలి..
ఆర్ఓఆర్ తప్పుల సవరణ, సెక్షన్-4, 5, 7 ల గురించి అలాగే ఏ సమస్యకి ఎలా అప్పీల్ చేసుకోవాలి అనే అంశం మీద క్షుణ్ణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సదస్సులో అవగాహన కల్పించాలన్నారు. అలాగే జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. మిగిలిన కొనుగోలు కేంద్రాలను కూడా త్వరితగతిన ప్రారంభించాలని, నిర్వాహకులు ప్రతీ రోజు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తైన వెంటనే ఓపీఎంఎస్ లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని, తద్వారా సకాలంలో రైతులకు డబ్బులు అందుతాయన్నారు.
అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తగిన జ్రాగత్తలు తీసుకోవాలని, ఎక్కువ రోజుల వరకు కేంద్రంలోనే పెట్టుకోకుండా తేమ శాతం రాగానే కాంటా పూర్తిచేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. నిత్యం అధికారులందరూ అ్రపమత్తంగా ఉండాలని, పౌరసరఫరాల శాఖ అధికారులు రోజుకు ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్య్రకమంలో డిఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, త్రూపాన్ జై చంద్రారెడ్డి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్