BJP Party | నర్సాపూర్, నవంబర్ 5 : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాధామల్లేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని అసెంబ్లీ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్లో బాంబులు వేయడం చేతకాదు కానీ ఇక్కడ ప్రచారానికి వస్తున్నారని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి మతిస్థిమితం లేని విధంగా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్కు భారతదేశం నరేంద్రమోదీ ఆధ్వర్యంలో చుక్కలు చూపించడం జరిగిందని.. ఇది ప్రపంచానికి తెలుసని గుర్తుచేశారు. అబద్దాల మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఇంకా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ రోజు రేవంత్రెడ్డి మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చురకలంటించారు.
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయాయని, ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఐకేపీ సెంటర్లు సరిగ్గా ప్రారంభం చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల గురించి ఆలోచించి.. వారు పండించిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేశ్, రమేశ్ గౌడ్, నారాయణరెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
NIT | వరంగల్ నిట్లో ఉచిత ‘గేట్’ కోచింగ్
Hanumakonda | డైట్లో అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
ISRO: జనవరిలో గగన్యాన్ పరీక్ష.. 2035 నాటికి స్పేస్ ల్యాబ్