Ganesh Navaratri Utsavalu | చిలిపిచెడ్, ఆగస్టు 26 : చిలిపిచెడ్ మండలంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఐ నర్సింలు సూచించారు. మంగళవారం నవరాత్రుల సందర్భంగా ప్రజల భద్రత, శాంతిభద్రతా వ్యవస్థల పర్యవేక్షణ కోసం చిలిపిచెడ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి డీవీ శ్రీనివాస్ ఆదేశాలతో చిలిపిచెడ్లో ఉన్న ప్రధాన చాముండేశ్వరి ఆలయం, డాబాలు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్లు, ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి అసాంఘిక శక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉన్నా వెంటనే గుర్తించేలా పర్యవేక్షణ చేపట్టారు. అలాగే గంజాయి, మాదక ద్రవ్యాలు,. నిషేధిత పదార్థాల రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేసి ప్రత్యేక దృష్టి సారించామని డీవీ శ్రీనివాస్ తెలిపారు.
ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలలో పాల్గొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు పౌరుల సహకారంతోనే పండుగలు సజావుగా, శాంతియుతంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం