CC Cameras | సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించ బడుతాయని న్యాల్కల్ మండలం, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా మండలంలోని హద్నూర్, న్యాల్కల్, రేజింతల్, ముంగి తదితర గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఎస్ఐ రాజశేఖర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్సై చల్లా రాజశేఖర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని వ్యాపార దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గృహ సముదాయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని అన్నారు.
ఏదైనా నేరం జరిగినప్పుడు వాటి దర్యాప్తులో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు. అందరూ సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలుసుకొని వాటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎస్ఐ వెంట పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.