Padma Devender Reddy | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22 : ప్రతీ గులాబీ కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నార్సింగ్ మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నర్సింగ్రావును ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు విచక్షణారహితంగా చితకబాదడాన్ని ఆమె ఖండించారు.
ఈ నేపథ్యంలో పద్మాదేవేందర్‌రెడ్డి ఇవాళ నర్సింగ్రావుతోపాటు మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, మాజీ మంత్రి హారీశ్‌రావును హైదరాబాద్‌లోని వారి నివాసాలలో వెళ్లి కలిశారు. బీఆర్ఎస్ శ్రేణులపై ఎమ్మెల్యే రోహిత్‌రావు చేస్తున్న అరాచకాలను కేటీఆర్‌కు, హారీశ్‌రావుకు పద్మాదేవేందర్‌రెడ్డి వివరించారు.
అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరేమన్నా అదిరేది బెదిరేది లేదన్నారు. ప్రతీ గులాబీ కార్యకర్తకు బీఆర్ఎస్ వెన్నంటి ఉండి అండగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. వారి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఇబ్బంది పెట్టే వారి ప్రతీ లెక్క తేలుద్దామని గులాబీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
పోలీసులు సైతం ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరించాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాలు కొల్పోయిందని, పాలనను మరిచి కక్ష్య సాధింపు చర్యలు కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఆమె వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, నార్సింగి మండల బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, సుజాత, స్వామి, కృష్ణారెడ్డి, ప్రభురెడ్డి, లింగారెడ్డి, ఉమామహేశ్వర్, సుభా,వ, అహ్మాద్, కిరణ్, రాజు తదితరులు ఉన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు