Minister Ponnam Prabhakar | అక్కన్నపేట, ఏప్రిల్ 17: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అక్కన్నపేట మండల పరిధిలోని గౌరవెళ్లి, గండిపల్లి ప్రాజెక్ట్‌లను పనులు ప్రారంభించి, పూర్తి చేస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేటి వరకు కూడా ప్రాజెక్టుల వైపు చూడలేదని బీజేపీ పార్టీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి ఆరోపించారు.
ఇవాళ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి గండిపల్లి, ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. అమలు కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలన అధ్వాన్నంగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జనగామ వేణుగోపాల్‌రావు, తిరుపతినాయక్, మోహన్‌నాయక్, సంపత్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత