వనపర్తి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ పనులు జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు వివరాల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఫార్మర్ రిజిస్ట్రీలో మూడు ఓటీపీలు నమోదు చేయాల్సి ఉండ గా, సైబర్ నేరాలు చోటు చేసుకుం టున్న క్ర మంలో ఈ కార్యక్రమం సజావుగా ముందు కు సాగడం లేదన్న అభిప్రాయం ఉన్నది. దీంతో అనుకున్నమేర ముందుకు సాగక ఈ ప్రక్రియ జిల్లాలో నెమ్మదించింది.
జిల్లాలోని 15మండలాల్లో 73,218 మంది రైతు కుటుంబాలున్నాయి. ఇప్పటి వరకు వ్యవసాయ అధికారుల సమాచారం మేరకు 44 వేల కుటుంబాల రిజిస్ట్రీ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ గతేడాది జిల్లాలో మొదలైంది. ఇప్పటి వరకు జరిగిన అంచనా ప్రకారం కేవలం 60 శాతం మాత్రమే నమోదు అయినట్లు భావిస్తున్నారు. ఏఈవోల ద్వారా జరుగుతున్న ఈ పని కొన్ని చోట్ల అనుకున్నంత వేగం పుంజుకోవడం లేదు. జిల్లా పరిధిలోని రెండు మండలాలు చిన్నంబా యి, ఆత్మకూరులకు ఏవోలు లేక పోస్టులు ఖాళీగా ఉన్నా యి. కనీసం ఏవోలు ఉంటే ఏఈవోలను పురమాయించే అవకాశం ఉంటుంది. పక్క మం డలాల ఏవోలకు ఇన్చార్జీలుగా ఇచ్చినా వారి పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉన్నది. వీటితోపాటు రెగ్యులర్ జిల్లా వ్యవసాయ అధికారి లేనందునా కొత్తకోట ఏడీఏనే ఇన్చార్జి డీఏవోగా కొనసాగుతున్నారు.
ప్రతి రైతుకు ఐడీ నెంబర్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అందించే పథకాలు పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఫార్మ ర్ రిజిస్ట్రీ నమోదును చేపట్టారు. దీని ద్వారా రైతులకు 14 అంకెల యూనిక్ ఐడీ రిజిస్టర్ అవుతుంది. దీంతో ఐడీ నెంబర్ చెబితే రైతు భూముల వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. వివిధ బ్యాంకులు రుణాలు మంజూ రు చేయాలన్నా.. భూములకు సంబంధించిన పూర్తి సమాచారం కావాలన్నా ఈ ఐడీ ద్వారా సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సహితం వీటి ద్వారా పరిశీలించడం కూడా సులభతరం కానుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అవగాహన లేకపోవడంతో..
ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతుల నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులు వివరాలు నమో దు చేస్తున్నారు. ఇందుకోసం పట్టాదారు పా సు పుస్తకం, ఆధార్ నెంబర్ నమోదు చేయా ల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైతు మొబైల్కు మూడు ఓటీపీలు వస్తుండటం, మళ్లీ అవి ఏఈవోకు చెప్పాల్సి ఉంటుంది. ఇలా మూడు ఓటీపీలను చెప్పడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన లేకపోవడం, రిజిస్ట్రీ పని పూర్తి చేయలేదని అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఏఈవోలు ఇరుకున పడుతున్నారు. వీటితో పాటు మరికొందరు రైతులతో ఫోన్ లేకపోవడంలాంటి సమస్యలు ఏఈవోలను వెంటాడుతున్నాయి.
సైబర్ నేరాల జోరుతో…
ప్రస్తుతం సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగి పోయింది. వాటి నియంత్రణకు పోలీసులు, అధికారులు ప్రజలకు అప్పుడప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. గుర్తు తెలియని వారికి పోన్ సమాచారం ఇవ్వాలన్నా.. ఓటీపీల వివరాలను చెప్పాలన్నా కాస్తా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఏఈవోలకు గ్రామా ల్లో ఉండే రైతుల నుంచి పెద్దగా సమస్య లేకున్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులతోనే అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిలో పార్మర్ రిజిస్ట్రీ ఇంకా కొలిక్కి రాకపోవడానికి కారణంగా సిబ్బంది చెబుతున్నారు.
నెలాఖరు వరకు పూర్తి చేస్తాం..
ఫిబ్రవరి నెల చివరి వరకు ఫార్మర్ రిజిష్ట్రీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం ఉన్న ది. కలెక్టర్ రోజు వారీగా పర్యవేక్షణ చేస్తున్నా రు. 60శాతంపైగా పూర్తి చేశాం. మిగిలిన పని ని పూర్తి చేయాలని ఏఈవోలపై ఒత్తిడి పెం చాం. భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా వచ్చే ఐడీ నెంబర్ ద్వారానే వివిధ ప్ర భుత్వ పథకాల అమలు ఉంటుంది. ఈ నెల లో కొంత పురోగతి సాధించాం.
– దామోదర్గౌడ్, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి, వనపర్తి
సంఖ్య మండలం రిజిస్ట్రీ నమోదు
1) అమరచింత : 64శాతం
2) ఆత్మకూరు : 56శాతం
3) మదనాపురం : 58శాతం
4) కొత్తకోట : 57శాతం
5) చిన్నంబాయి : 62శాతం
6)వీపనగండ్ల :75శాతం
7)పాన్గల్ : 48శాతం
8) పెద్దమందడి 48శాతం
9) ఖిల్లాఘణపురం : 67శాతం
10) గోపాల్పేట : 62శాతం
11) రేవల్లి : 68శాతం
12) ఏదుల : 36శాతం
13) పెబ్బేరు : 65శాతం
14) శ్రీరంగాపురం : 58శాతం
15) వనపర్తి : 50శాతం