Anganwadi children | నర్సాపూర్, ఆగస్టు 25 : మెదక్ జిల్లా శివ్వంపేట్ మండల్ రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఎలుక పడిన నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.
విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో, డాక్టర్లతో మాట్లాడి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న సమస్యలను కూడా సూపరింటెండెంట్‌కు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు పెద్ద రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, శివంపేట మండల్ బీజేపీ అధ్యక్షుడు పెద్దపులి రవి, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శిలు సంఘసాని రాజు, రామ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బిక్షపతి, అశోక్ సదుల్లా, బాలరాజు, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బబ్బురి కృష్ణ, బూత్ అధ్యక్షుడు ఈశ్వర్, బీజేపీ నాయకుడు నర్సారెడ్డి, అశోక్, బిక్షపతి, రాంసింగ్ నాయక్ ,సుధాకర్, రత్నాకర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు