Cyber Crimes | టేక్మాల్, అక్టోబర్ 1 : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ క్రిష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన టేక్మాల్ చౌరస్తాలో సోమవారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిందని, పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తతతో ఉండాలన్నారు.
కొత్త వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా వారికి వ్యక్తిగత విషయాలు చెప్పరాదన్నారు. ఓటీపీ, కేవైసీ వంటి వివరాలతో వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదన్నారు. అపరిచితులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం, ఆధార్, పాన్‌కార్డు ఇతర వివరాలను వెల్లడించకూడదన్నారు. సైబర్ మోసానికి గురైన బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.
సైబర్ నేరాల పట్ల అవగాహన ఉంటేనే వాటి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవదాస్, సిబ్బంది క్రిష్ణ, చిరంజీవి, రవీందర్, రాజేందర్ తదితరులు ఉన్నారు.
Harish Rao | కేసీఆర్‌కు రైతుకు ఉన్నది పేగు బంధం.. కాంగ్రెస్‌కు ఉన్నది కేవలం ఓటు బంధం: హరీశ్ రావు
DA hike | పండగ వేళ గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఉద్యోగులకు డీఏ పెంపు..?
Asia Cup | ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన పీసీబీ చైర్మన్ నఖ్వీ..!