MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, సెప్టెంబర్ 18 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బతుకమ్మ పాటల ఆవిష్కరణలో మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులం, మతం, బీద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క మహిళ కలిసి మెలిసి ఆడుకునే గొప్ప పవిత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అని కొనియాడారు.
దేవుడిని రోజు పూలతో పూజిస్తామని, దేవుడిని పూజించే పూలనే పూజించే గొప్ప పవిత్రమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ బతుకమ్మ పండుగలో మహిళలు ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొనడం జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఉధ్యమ సమయంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, మహిళలు బతుకమ్మ ఆడుతూ, బోనాలు ఎత్తి ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. ఆ సమయంలోనే దేశవిదేశాలలో బతుకమ్మకు గుర్తింపు వచ్చిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని గుర్తుచేశారు. అప్పటి నుండి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో, గ్రామాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగకు మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Drugs | మాసాయిపేటలో 4 కిలోల డ్రగ్స్ పట్టివేత..
Promotions | రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
Traffic Jam | హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్