Farmers | శివ్వంపేట, జూన్ 3 : శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవెత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు.
సమగ్ర పోషక యాజమాన్య పద్దతులు, ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం, రైతులకు ఎఫ్‌పీఓ స్థాపన వల్ల కలిగే లాభాలు, వరిలో వాడే వివిధ యంత్రాలు, డ్రోన్ల ఉపయోగం, రైతులు విత్తనాలు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. శాస్త్రవేత్తలు శరవణన్, డాక్టర్ పాపారావు, ఓ లావణ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ మాధవరెడ్డి, రైతులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్, బుచ్చిరెడ్డి, హనుమంతురెడ్డి, సురేశ్‌గౌడ్, మురళీ తదితరులు ఉన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు