Narsapur Constituency | నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఎన్ని నిధులు తీసుకువచ్చావని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్ ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కేసీఆర్ ఇవ్వలేదని.. గ్రామపంచాయతీ నిధుల నుండి సర్పంచులు తెచ్చుకున్నారని రాజిరెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఎఫ్సీ ద్వారా గ్రామపంచాయతీలకు నిధులను కేటాయిస్తే దాంట్లోంచి జీపీ ట్రాక్టర్లను కొనడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇప్పటివరకు ఎన్ని నిధులు గ్రామపంచాయతీలకు విడుదల చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీలకు అందించిన నిధుల ద్వారానే సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, సెక్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనం తదితర అభివృద్ధి పనులను చేసుకోవడం జరిగిందన్నారు.
చిప్పల్ తుర్తి గ్రామాన్ని మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించగా గ్రామంలోని సమస్యలను పంచాయతీ సెక్రెటరీ, గ్రామస్తులు వారి దృష్టికి తీసుకువస్తే పంచాయతీ సెక్రటరీకి మెమో జారీ చేయడం సమంజసం కాదన్నారు. రాజిరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లుగా మాత్రమే ప్రజలకు తెలుసని అంతకుమించి అవగాహన లేదన్నారు. జక్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ విగ్రహావిష్కరణను రాజకీయం చేయడం తగదన్నారు. విగ్రహదాత గతంలో బీఆర్ఎస్కు చెందినవాడని తను విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.
దొంగచాటుగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ..
చనిపోయిన వ్యక్తిపై రాజకీయ రంగు పులమడం ఏంటని ఘాటుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గత 20 సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉంటూ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశారని.. ఏ ప్రోటోకాల్ లేని రాజిరెడ్డికి ఆమె గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎలాంటి అధికారం లేకున్నా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అధికారులు లేకుండానే దొంగచాటుగా పంపిణీ చేయడం హాస్యాస్పదమన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అనడం సిగ్గుచేటని, రైతు భరోసా రూ.15000 ఇస్తామని రూ.12000 మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు పై, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై, బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్ అని వారు హెచ్చరించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి రాజిరెడ్డి ఇప్పటివరకు ఎన్ని నిధులు తీసుకువచ్చాడో ప్రజలకు వివరించాలని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గ్రామపంచాయతీలకు నిధులను మంజూరు చేయించాలని.. అలాగే సిబ్బందికి జీతాలను విడుదల చేయించాలని హెచ్చరించారు. అధిష్టానం మెప్పు కోసం హరీష్ రావును, సునీత లక్ష్మారెడ్డిని తిట్టడం సరికాదని చురకలాంటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయుముద్దీన్, రాష్ట్ర నాయకులు సత్యం గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్, ఆనంద్ కుమార్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ