Auto Driver | ఝరాసంగం, సెప్టెంబర్ 29 : తన ఆటోలో దొరికిన డబ్బును మళ్లీ ఆ యజమానికే అందేలా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. మనిషి నిజాయితీకి అద్దం పట్టే ఈ సంఘటన ఝరాసంగంలో చోటుచేసుకుంది. ఝరాసంగం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్ ఆదివారం తన వాహనాన్ని శుభ్రం చేస్తుండగా సీటులో సుమారు రూ.8 వేల నగదు దొరికింది. అయితే రాజ్‌కుమార్ ఆ డబ్బులు తనవని భావించకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసి గొప్ప మనసు చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే… ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేష్ దసరా సరుకుల కోసం జహీరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో రాజ్‌కుమార్ ఆటోలో వచ్చాడు. ఆ సమయంలో సంగమేష్ వద్ద ఉన్న నగదు ఆటోలో జారిపడిపోయింది. అయితే ఈ విషయాన్ని సంగమేశ్ గుర్తించలేకపోయాడు. ఇక ఆ నగదును తీసుకున్న రాజ్‌కుమార్ నేరుగా వెళ్లి పోలీసులకు అందజేశాడు.
పోలీసుల దర్యాప్తులో ఆ నగదు యజమాని సంగమేష్కే చెందిందని నిర్ధారించి సోమవారం అతనికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ రాజ్‌కుమార్‌కు ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ శాలువా కప్పి సత్కరించి అభినందించారు. నిజాయితీకి ప్రతీకగా నిలిచిన రాజ్‌కుమార్ ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని ఎస్ఐ క్రాంతికుమార్ పాటిల్ ప్రశంసించారు. స్థానికులు కూడా రాజ్‌కుమార్ నిజాయితీగా గొప్ప మనసుతో డబ్బులు తిరిగి అందజేసిన రాజ్‌కుమార్‌ను స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Vidadala Rajini | వైసీపీకి షాక్.. విడదల రజినీపై డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు!
Modi-Meloni | మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట.. మరోసారి తెరపైకి ‘మెలోడీ’ మూమెంట్
Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ముగ్గురు మృతి