Prime Minister Rashtriya Bal Puraskar | మెదక్ రూరల్, ఏప్రిల్ 28 : ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని హైమావతి తెలిపారు.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. 2025 -2026లో భాగంగా అందించనున్న బాలశక్తి పురస్కార్ అవార్డులకు 31.07.2025వ తేదీలోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వివిధ రంగాలలో ప్రతిభ చూపిన 6 నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆవిష్కరణ, సృజనాత్మకత, మంచి అభ్యాస వాతావరణం, సాంస్కృతిక కళలు, సాహసం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన బాల బాలికలు https://awards.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్