Degree students | అందోల్, మే17: జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో 2016-17 నుంచి 2019-20 బ్యాచ్‌లో 1వ సెమిస్టర్ నుంచి 6వ సెమిస్టర్ వరకు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి బ్యాక్‌లాగ్స్ పరీక్షలు రాసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతినిచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ డా. రమేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ రమేశ్ డా. రమేశ్ సూచించారు. ఎలాంటి ఫైన్ లేకుండా మే 19 వరకు.. ఫైన్‌తో 29 వరకు పరీక్ష ఫీజులు చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి.. సకాలంలో ఫీజులు చెల్లించి పరీక్షలకు హజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు