కోదాడ, ఫిబ్రవరి 23 : కోదాడ పట్టణంలోని 28వ వార్డులో గత వారం రోజుల నుండి యువత మన వార్డు మన శుభ్రత లక్ష్యంగా గత కొంతకాలంగా వార్డులో నిలిచిపోయిన సీసీ రోడ్ల మరమ్మతులు, కంపచెట్లు, పిచ్చి మొక్కలు తొలగిస్తూ మురుగు కాల్వలను శుభ్రం చేయడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి చిన్న పనికి మున్సిపల్ సిబ్బందిపై ఆధారపడకుండా వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీను చొరవతో ఈ పనులు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.