Vivek Venkataswamy | నర్సాపూర్, జూలై 17 : మహిళ సంఘాల సభ్యులు పెట్రోల్ బంక్ నిర్వహించుకోడానికి నర్సాపూర్ పట్టణంలో పెట్రోల్ బంకుకు స్థలం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కార్మాగారాలు, గనులు భూగర్భ శాస్త్ర, మెదక్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కలెక్టర్‌ను ఆదేశించారు.
గురువారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో రూ.183.75 లక్షల అంచనా వ్యయంతో మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుండి హకీంపేట్ వరకు బీటీ రోడ్డు, రూ.169.50 లక్షల అంచనా వ్యయంతో జడ్పీ రోడ్డు నుండి నాగ్సాన్పల్లి గ్రామం (మాసాయిపేట్ మండలం) వరకు బీటీ రోడ్డు అభివృద్ది సంక్షేమ పథకాలకు సంబంధించిన రెడీమేడ్ శిలాఫలకాలను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు.
అనంతరం సాయికృష్ణ గార్డెన్లో శాదీముబారక్, కళ్యాణలక్ష్మి, అలాగే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి మరో పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. మహిళల పేరు మీదనే రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్లను జారీ చేయడం జరుగుతుందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీనివాసరావు, తహసిల్దార్లు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం