MRO Rajinikumari | రామాయంపేట, ఏప్రిల్ 30 : రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యం నిల్వ ఉంచవద్దని.. వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి రైస్ మిల్లర్లకు సూచించారు. ఇవాళ రామాయంపేట పట్టణ శివారులో ఉన్న బాలాజీ రైస్‌మిల్లును తహసీల్దార్ రజినీకుమారి తనిఖీ చేశారు. అనంతరం ఆమె వారికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రైస్‌మిల్లులో ధాన్యం నిల్వ ఉంచకూడదని రైస్ మిల్ యజమానికి సూచించారు. లారీ మిల్లుకు రాగానే వెంటనే అన్లోడ్ చేసి రికార్డులో నమోదు చేయాలన్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా రైస్‌మిల్లులో ధాన్యం ఉండవద్దన్నారు. నిల్వ ఉన్న రైస్‌మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ రజినీకుమారి హెచ్చరించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న అన్నీ రైస్‌మిల్లులను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎలాటి ఇబ్బందులు లేవని.. అన్ని వసతులను కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ.గౌస్, తదితరులు ఉన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం