Private Colleges | రామాయంపేట, జూన్ 23 : ఇంటర్ విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల్లో అన్ని వసతులు కల్పించాలని లేకుంటే వారి అనుమతులను రద్దు చేయడం జరుగుతుందని ఇంటర్ బోర్డు విద్యాధికారిణి మాధవి పేర్కొన్నారు.
సోమవారం రామాయంపేటకు విచ్చేసిన అధికారిని ముందుగా రామాయంపేటలోని ప్రైవేటు కళాశాలలు సాయి కృప, స్నేహ కళాశాలలను సందర్శించారు. అక్కడి నుండి నేరుగా కస్తూర్బా పాఠశాలకు వెల్లి వంట గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం విలేకరలుతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. విద్యార్ధులకు మంచి సన్నబియ్యంతో భోజనం, ఫీజులు లేకుండా చదువు, మంచి లెక్చరర్లతో విద్య చెప్పించడం జరుగుతుందన్నారు. అంతే గాకుండా హాస్టల్ వసతిని కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. నూతనంగా కస్తూర్బాలో ఇంటర్ బైసీపీ కోర్సును కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
విద్యార్థులు ప్రైవేటు జోలికి వెల్లకుండా ప్రభుత్వ కళాశాలల్లోనే చదువాలన్నారు. వంట నిర్వాహకులు మెను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. అలాగాకుండా ఇష్టారీతిగా నాణ్యత లేకుండా భోజనం పెడితే చర్యలు ఉంటాయన్నారు. అధికారిని వెంట కస్తూర్బా ప్రిన్సిపాల్ అనురాధ తదితర లెక్చరర్లు ఉన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన