Collector Rahul raj | పాపన్నపేట, జులై 30 : మెదక్ జిల్లాలో కొత్తగా 9964 రేషన్ కార్డులు మంజూరు చేశామని, దీని ద్వారా 44,694 మందికి లబ్ధి చేకూరినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని చిత్రియాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కల ఈ రోజు నెరవేరిందన్నారు. జిల్లాలో ఇప్పటికే శాసనసభ్యుల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ జరిగిందన్నారు.
జనవరి 26న ప్రజా పాలన రోజు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంగా, రేషన్ కార్డు లేని వారి కోసం ఒక ఫార్మాట్ ఇచ్చినట్లు చెప్పారు. అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, అర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇందులో 34,730 మంది పేర్లు కొత్తగా చేర్చామన్నాడు.
పాపన్నపేట మండలంలో కొత్తగా 479 రేషన్ కార్డుల పంపిణీ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ సతీష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద నాయక్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, మోహన్, సురేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Madhira : బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : చిత్తారు నాగేశ్వర్రావు