Current Wire | నర్సాపూర్, మార్చి 29 : అది వ్యవసాయ పొలాలకు కరెంట్ సరఫరా చేసే 11 కేవీ వైర్. ఆ వైర్ల ద్వారా రైతులకు విద్యుత్ సరఫరా చేయాల్సిన అధికారులు వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ డీసీ బార్ సమీపంలో వ్యవసాయ పొలాలకు వెళ్లే 11 కేవీ వైర్లను కింది స్థాయి సిబ్బంది తొలగించి విలువైన అల్యూమినియం వైర్‌ను బ్లాక్‌లో అమ్ముకున్నారు. అయితే డీసీ బార్ వెనకాల నూతనంగా ఓ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్ యాజమాని ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి పొలాలకు వెళ్లే కరెంట్ వైర్ తొలగించడం పట్ల పలువురు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
వ్యవసాయ పొలాలలో ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి కరెంటు తీగలను తొలగించిన సదరు ట్రాన్స్ కో సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక రైతులు కోరుతున్నారు.
ఇదే విషయమై మెదక్ డీఈఈ స్వామిని వివరణ కోరగా అనుమతులు లేకుండా వైర్లను తొలగించిన వారిపై చట్టపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్