బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Feb 03, 2020 , 03:57:42

ఆరని అక్షర దీపాలు వెలిగించిన సదాశివుడు

ఆరని అక్షర దీపాలు వెలిగించిన సదాశివుడు
  • సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశ్‌పతి శ్రీనివాస్‌

మంచిర్యాల అగ్రికల్చర్‌: పీడితుల గొంతుక, పిడికిలి, ఆరని అక్షర దీపాలు వెలిగించింది ‘సదా శివు డు’ అని తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు, ప్ర ముఖ కవి, గాయకుడు, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని ఎంకన్వెన్షన్‌ హాల్‌లో తెలంగాణ వికాస సమితి, చేతన సాహి తి, సాంస్కృతి సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన ప్రముఖ కవి మల్లావజ్జుల సదాశివుడు 13వ స్మారక సభ, ప్రముఖ కవి బెల్లి యాదయ్యకు సదాశివుడు స్మారక పురస్కారం అందజేత కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సదాశివుడు రాసిన‘తలాపున పారుతుంది గోదారీ.. నీ చేనూ నీ చెల్కా ఎడారి’ కవితను పాడి వినిపించి ఆయన గొప్పతనాన్ని వివరించారు. 


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి తీర గ్రామమైన ముర్మూర్‌లో జన్మించిన సదాశివుడు నమ్మన మంచి కోసం అహర్నిశలు శ్రమించారనీ, మరణించేంత వరకు సమాజహిత కార్యాచరణ, సాహితీ సృజనను వీడలేదన్నారు. సదాశివుడు ప్రజల ఆరాటాల పాట అయ్యిండు, కనులు చెమ్మగిల్లేలా వేదనను పాట కట్టిండనీ, ఆ వేదనలను రూపుమాపేందుకు దారి చూపి దీపమైండన్నారు. ఆయన సాహి త్య సేవలను అతిథులు కొనియాడారు. ఎమ్మెల్యే దివాకర్‌ రావు మాట్లాడుతూ సదాశివుడు స్మారక పురస్కారం అందుకోనున్న ప్రముఖ కవి బెల్లి యా దయ్య ఎంతో గొప్ప వారనీ, అలాంటి వారిని మా జిల్లాలో సన్మానించడం గర్వంగా ఉందన్నారు. 


యాదయ్య పాదాలపై రచించిన పద్యంను విన్న ఎవరైనా ఆయన ఎంత గొప్ప కవో అర్థమవుతుందన్నా రు. అనంతరం సదాశివుడు స్మారక పురస్కారాన్ని కవి బెల్లి యాదయ్యకు ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే దివాకర్‌ రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అందజేసి శాలువా, పూలమాలతో సత్కరించారు. మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముకేశ్‌ గౌడ్‌, చైతన్య సాహితి అధ్యక్షుడు వజ్జల శివకుమార్‌, కథ, నవాల రచయితలు పీ చందు, వారాల ఆనంద్‌, వల్లావజ్జుల విజ య్‌, వంశీ, మునీర్‌, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్‌ రవీందర్‌, కవులు, రచయితలు, నాయకులు అంజన్న, భిక్షపతి నాయక్‌, ఫణి రాజారావు, పింగిడి వెంకన్న, రాజేశ్వర్‌, రాజన్న, సాగర్‌, మల్లన్న, శ్రీనివాస్‌, రమేశ్‌, అల్లాడి శ్రీనివాస్‌, గుండేటి యోగేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సందెల వెంకటేశ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.


logo