DC vs RR | బట్లర్ బౌల్డ్.. సిక్సర్లతో హోరెత్తిస్తున్న శాంసన్
DC vs RR : భారీ ఛేదనలో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే లోపు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో ఓపెనర్ జోస్ బట్లర్(19) ఔటయ్యాడు.
DC vs RR : భారీ ఛేదనలో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే లోపు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో ఓపెనర్ జోస్ బట్లర్(19) ఫోర్, సిక్సర్ బాదాడు. ఆ తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. దాంతో, పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ పడింది. రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు.
ఖలీల్ అహ్మద్ వేసిన స్లో బాల్‌కు భారీ షాట్ ఆడిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్(41) తన తరహాలో రెచ్చిపోతున్నాడు. బౌలర్ మారినా తగ్గేదేలే అంటూ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. దాంతో, పవర్ ప్లేలో రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి రన్స్ చేసింది. ఇంకా ఆ జట్టు విజయానికి 155 పరుగులు కావాలి. పరాగ్, శాంసన్‌లు నిలబడితే టార్గెట్‌ను ఈజీగా ఛేదించే చాన్స్ ఉంది.
ప్లే ఆఫ్స్ అవకాశాలు మిణుకుమిణుకుమంటున్న వేళ ఢిల్లీ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అభిషేక్ పొరెల్(65), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(50)లు రాజస్థాన్ బౌలర్లను ఉతికారేస్తూ హాఫ్ సెంచరీ బాదారు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. ఓపెనర్ల విధ్వంసంతో పంత్ సేన భారీ స్కోర్ కొట్టడం ఖాయనుకున్న దశలో సీనియర్ స్పిన్నర్లు అశ్విన్(324) తిప్పేశాడు. ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్(41) తన తరహాలో విజృంభించి సిక్సర్ల మోత మోగించాడు. గుల్బదిన్ నయూబ్(19)తో 45 రన్స్ జోడించి ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

