Bird Flu | కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి అతివేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా దానిపై అవగాహన కల్పించాలని పలువురు నాయకులు కొత్తకోట మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు కొత్తకోట పట్టణానికి చెందిన పలువురు నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి చనిపోతున్నాయన్నారు.
ఈ వ్యాధి సోకిన కోళ్లను మనుషులు తినడం వలన వారికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని చికెన్ వ్యాపారస్తులకు బర్డ్ ఫ్లూ వ్యాధిపై తగిన సూచనలు, సలహాలు తెలియజేసి.. పట్టణాన్ని ఆరోగ్యపథంలో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రేమదానం, సంపత్, కొమ్ము రవికుమార్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
Warangal | కేంద్రం బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : స్వామి బోధమయానంద
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ