Bhumi Pooja | పెద్దమందడి, మార్చ్ 10 : వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర మరుగుదొడ్ల నిర్మాణానికి ఇవాళ ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అర్చకుడు భాస్కర్ శర్మలు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఎన్ఆర్ఈజీఎస్ నుండి రూ.2 లక్షల 10 వేలు గ్రామపంచాయతీ నుండి 90 వేల రూపాయలను నిధుల నుండి ఇప్పించడం జరిగిందిన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులతోపాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, పూజారి భాస్కర్ శర్మ, గ్రామస్తులు సింగిల్ విండో డైరెక్టర్ నరేష్, పుల్లన్న యాదవ్, ప్రవీణ్ రెడ్డి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి