All Party United Forum | అమరచింత: వనపర్తి జిల్లాలోని ప్రజా సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పేర్కొన్నారు. ఇవాళ అమరచింతకు వచ్చిన ఆయన సీపీఐ జిల్లా కార్యదర్శి అమరచింత మున్సిపల్ మాజీ కౌన్సిలర్ విజయ రాములు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాల అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత పదేళ్లుగా సాగు తాగునీరులో పుష్కలంగా విరాజిల్లిన వనపర్తి జిల్లా వేసవి కాలానికి ముందే తాగు సాగునీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను తుంగలో తొక్కి కాలయాపనతో పాలన కొనసాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సమావేశం ఏర్పాటు చేసి నిరంతర కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలియజేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న విజయరాములు పుట్టినరోజు కావడంతో అలాగే ఐక్యవేదిక గౌరవ సలహాదారులుగా పనిచేస్తున్న పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి తన నివాసంలో పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం చేసినట్టుగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ వెల్లడించారు. ఆయన వెంట సీపీఐ పట్టణ కార్యదర్శి రమేష్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు గౌరీ కానీ యాదయ్య, కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు, సామాజికవేత్త కళాకారుని శ్యామల, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఓ శ్రీ సురేష్ తదితరులు ఉన్నారు.
Rashmi Gautam| రాజమండ్రిలోని గోదావరిలో అస్థికలు కలిపి ఫుల్ ఎమోషనల్ అయిన రష్మీ గౌతమ్
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం : బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్
Nizampeta Farmer | రెండు బోర్లు వేసిన.. బొట్టు నీళ్లు పల్లేదంటూ నిజాంపేట యువ రైతు ఆవేదన