GN Srinivas | మహబూబ్ నగర్, కలెక్టరేట్, మార్చి 26 : రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సేకరించిన భూములలో భవనాలు నిర్మించి సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూనివర్సిటీలపై అధికారం, ఆధిపత్యం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ అధికారాన్ని పొగొట్టుకోవడానికి, చేజార్చుకోవడానికి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు.
యూజీసీ నూతన నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే మనువాద బీజేపీ కుట్రలను వ్యతిరేకించాలంటూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఇవాళ పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన యూనివర్సిటీ విద్యను గతంలో ప్రభుత్వం జిల్లాల్లోనూ ఉన్నత విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పాలమూరు యూనివర్సిటీ, కరీంనగర్లో శాతవాహన ఇలా తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు.
స్థానిక ప్రజల అవసరాలకు, స్థానికతకు అనుగుణంగా ఉండాలనే లక్ష్యంతోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అందుకు అనుగుణంగానే భవనాలు నిర్మించి, కోర్సులు ఏర్పాటు చేసి సమర్థవంతంగా కొనసాగిస్తుందన్నారు. కేంద్రం రాష్ట్ర యూనివర్సిటీ విద్యను ఆధీనంలోకి తీసుకునే దానికంటే కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని అన్నారు. ఉన్నత విద్యను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలే.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నత విద్య ఉండాల్సిందే.
యూనివర్సిటీలపై అజమాయిషీ సమంజసం కాదు..
కేంద్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ లాంటి వెనుక బడిన జిల్లాలో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సెంట్రల్ యూనివర్సిటీలతో నిరుపేద విద్యార్థులకు ఆధునిక ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూనివర్సిటీలపై అజమాయిషీ చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు.
యూనివర్సిటీల్లో ఇన్‌టేక్ పెంచి అందుకు అనుగుణంగా నిధులు కేటాయించాలని అప్పుడే పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతంలో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులు కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నూతన గైడ్‌లైన్స్ వచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో యూనివర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి, పీడీఎస్ యూ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయకన్నా, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, సాంబా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బత్తినిరాము, మీసాల గణేష్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి