PDS Rice | ఖిల్లా ఘనపూర్, మార్చి 6 : ఖిల్లా ఘనపూర్‌లో అక్రమ రేషన్ బియ్యంను పట్టుకున్నారు. ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామములో సింధు రైస్ మిల్లు యజమాని జిల్లాలో అక్రమ దందా చేస్తూ.. జిల్లా అధికారులను సంతృప్తి పరుస్తూ తప్పించుకుంటున్నాడు. దీంతో రాష్ట్ర సీసీఎస్ సిబ్బంది పక్కా ప్లాన్‌తో రాత్రి 10.30లకు సదరు యజమాని మిల్లుపై దాడి చేసి పీడీఎస్ బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది.
మిల్లు యజమాని అధికారులను ప్రలోభపెట్టి ఆ అక్రమ బియ్యం బయట దొరికినట్టు చూపి కేసు నుండి తప్పించుకోవాలని చూస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది వైరల్ కాకుండా చూసుకొని అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసు మాఫీ చేసుకోవాలని చూస్తున్నారని.. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు స్పందించి అక్రమ రవాణాను అరకట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు