Illegal Sand Mining | మాగనూరులో ఇసుక అక్రమ రవాణా.. గ్రామస్తులు పట్టించిన 10 టిప్పర్లను వదిలేసిన పోలీసులు
Illegal Sand Mining | నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
Illegal Sand Mining | మాగనూరు ఏప్రిల్ 04: నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్వాట్ శివారులో రాత్రి వేళలో 10 ఇసుక టిప్పర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించినా.. మధ్యలోనే వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వడ్వాట్ గ్రామస్తుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి అడవి సత్యారం పెద్దవాగు నుంచి హిటాచీల సాయంతో ఇసుకను లోడ్ చేసి 10 టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు టిప్పర్లను అప్పగించి అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్లిపోయారు.
అయితే టిప్పర్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిన మాగనూరు పోలీసులు వాటిని మధ్యలోనే వదిలేశారు. దీంతో యథేచ్ఛగా రాత్రంతా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణాను జోరుగా కొనసాగించారని వడ్వాట్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పోలీసులు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారని విమర్శించారు. ఏవైనా అక్రమాలు జరిగినప్పుడు సమాచారం ఇచ్చి వారిని వివరాలు గోప్యంగా ఉంచాల్సిన పోలీసులు.. సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై మాగనూరు ఎస్సై అశోక్‌బాబును నమస్తే తెలంగాణ రిపోర్టర్ ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. దీనిపై నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌ను వివరణ కోరగా.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని తెలిపారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

