Narayanapet | మాగనూరు: నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తాళంకేరి, గురురావు లింగంపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ఆయా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురురావు లింగంపల్లి గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఈడికి లక్ష్మీదేవమ్మను, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆంజనేయులు సిద్ధును ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
అలాగే తాళంకేరి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉప్పరి పోలమ్మ సర్పంచ్‌గా, ఇండిపెండెంట్ అభ్యర్థి శ్యామ్ సుందర్‌ను ఉపసర్పంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లను ఘనంగా సన్మానం చేసి స్వీట్లు తినిపించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.