న్యూఢిల్లీ, మార్చి 3 : ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పశ్చిమాసియాలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 5, 6 తేదీల్లో జరగాల్సిన 10, 12 తరగతి పరీక్షలను వాయిదా వేశామని సీబీఎస్ఈ పరీక్ష కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
పశ్చిమాసియాలోని బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, అరేబియా, యూఏఈ దేశాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఈ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. అలాగే తర్వాతి పరీక్షలు నిర్వహించేది, లేనిది 5వ తేదీన పరిస్థితిని సమీక్షించి ప్రకటిస్తామన్నారు.