నారాయణపేట, జనవరి 20 : ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి మంగళవారం నారాయణపేట డీఎస్పీ కి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయి పదవిలో ఉండడమే కాకుండా స్వయంగా హోం శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ జెండా దిమ్మెలను పగలగొట్టాలని, బీఆర్ఎస్ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని మాట్లాడడమే కాకుండా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను కించ పరుస్తూ మాట్లాడడం ఎంత వరకు సమంజసమని అన్నారు.
ఈ విధంగా రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో గందరగోళ వాతావరణానికి ఉసిగొల్పుతున్న రేవంత రెడ్డి పై తక్షణమే కేసు నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ సాగర్, నాయకులు కె. సుదర్శన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గురులింగ్, బోయ లక్ష్మణ్,అట్టు, ఫిరోజ్, చాంద్, సురేందర్ రెడ్డి, ఆకుల గోపి తదితరులు పాల్గొన్నారు.