Leopard | నారాయణ పేట, మార్చి 5 : నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో చిరుత హల్ చల్ చేసింది. మోమినాపూర్ గ్రామ శివారులో చిరుత పులి దాడి చేసిన ఘటనలో బర్రెదూడ మృతి చెందిన ఇవాళ వెలుగు చూసింది. మోమినాపూర్ గ్రామానికి చెందిన గూళ్ల హనుమంతు తన వ్యవసాయ పొలం దగ్గర మంగళ వారం రాత్రి దూడను కట్టి ఇంటికి వచ్చాడు.
హనుమంతు రోజు వారి మాదిరిగా బుధవారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లి చూడగా దూడ మృతి ఉన్న విషయాన్ని గుర్తించాడు. బర్రె దూడ మృతి చెందిన ఘటనను చూసి చిరుత పులే దాడి చేసినట్లు రైతు భావించి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు.
ఇటీవల కాలంలో చిరుత పులి వరుస దాడుల నేపథ్యంలో రైతులు పొలాలకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. చిరుత ఆచూకీ తెలుసుకుని.. భవిష్యత్‌లో మరిన్ని దాడులు జరుగకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు