మక్తల్, మార్చి 08: మక్తల్ మండలం సంఘం బండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై మొసలి (Crocodile) ప్రత్యక్షమైంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు దానిని తాళ్లతో బంధించారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మాగనూరు సెక్షన్ ఆఫీసర్ డీ. వెంకటేశ్వర్లు, యానిమల్ వాచర్ విజయ్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. మొసలిని ఆటోలో కృష్ణా నదిలో వదిలివేయడానికి తీసుకెళ్లారు. రిజర్వాయర్లో నుంచి మొసళ్లు తరచూ కట్టపైకి వస్తుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పశువుల కాపరులు, గొర్ల కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు.