ACB Raids | మాగనూరు, డిసెంబర్ 03 : కృష్ణ మండల పరిధిలోని, హిందూపూర్ గ్రామ శివారులోనీ వసుధ రైస్ మిల్లులో, ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సంఘటన, గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ఏసీబీ డీఎస్పీ, సీహెచ్ బాలకృష్ణ వివరాల మేరకు.. ఏసీబీ హెడ్ ఆఫీస్ సీఐయూ యూనిట్ వారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, విధులు నిర్వహిస్తున్న, ల్యాండ్, రికార్డ్స్ ఆఫీసర్, ఏడీ, కొంతం శ్రీనివాసులుకి, ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారని, ఇందులో భాగంగానే కృష్ణ మండల పరిధిలోని ఉన్న ఎంఎస్, వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉదయం 6 గంటల నుండి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.
పంతం శ్రీనివాసులు ఆస్తులు, బినామీల పేరిట ఉన్నాయన్న ఆరోపణల మేరకు తనిఖీలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాసులు, ఏసీబీ సిబ్బంది, నారాయణపేట జిల్లా సివిల్ సప్లై డీటీ, గురు రాజారావు, తదితరులు పాల్గొన్నారు.
Rayapole Mandal | రాయపోల్ మండలంలో రెండు జీపీలు ఏకగ్రీవం.. పల్లెల్లో వేడెక్కిన రాజకీయం
Dasyam Vinay Bhaskar | కేసీఆరే పాలనే తెలంగాణకు రక్షణ : దాస్యం వినయ్ భాస్కర్
La Nina: ఈ శీతాకాలంలో లానినా ప్రభావం 55 శాతం మాత్రమే !