Jupally Krishna Rao | కొల్లాపూర్, జూన్ 25 : రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా మంత్రి జూపల్లి సోమశిల, అమరగిరి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నార్లాపూర్ రిజర్వాయర్, కొల్లాపూర్ లోని మాధవస్వామి ఆలయం, జెటప్రోలు మదనగోపాల స్వామి దేవాలయాన్ని సందర్శించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మంత్రి జూపల్లి వెంట పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఇతర అధికారులు ఉన్నారు. సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరిస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్‌స్టమెంట్(సాస్కి)’ పథకం కింద రూ.68.10 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో పర్యావరణం, జల వనరులు, ఆలయాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ కు పుష్కలమైన వనరులు ఉన్న సోమశిల, అమరగిరి ద్వీపం, ఈగలపెంటను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు, కార్యాచరణపై పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని, రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. త్వరలో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కృషి..
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తామని, ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరిస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్‌స్టమెంట్(సాస్కి)’ పథకం కింద రూ.68.10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఆ నిధులతో పర్యావరణం, జల వనరులు, ఆలయాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ కు పుష్కలమైన వనరులు ఉన్న సోమశిల, అమరగిరి ద్వీపం, మల్లేశ్వరం, ఈగలపెంటను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు.
క్లస్టర్ 1: ఈగలపెంట అరైవల్ జోన్, ఈగలపెంట విహార యాత్ర, ఈగలపెంట రివర్ క్రూయిజ్, చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్, క్లస్టర్ 2: సోమశిల వెల్నెస్ అండ్ స్పిరిచ్యువల్ రిట్రీట్ ఉంటాయని అన్నారు. సోమశిలలో బోటింగ్ జెట్టి, అమరగిరి ద్వీపంలో బోటింగ్ జెట్టి, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, కేఫ్టీరియా, స్పా, వెల్ నెస్ సెంటర్, ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్, ఇతర సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ