బిజినపల్లి జనవరి 25 : ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ గ్రామంలో రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని హైదరాబాద్ నుండి నాగర్ కర్నూల్ కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Shah Rukh Khan | క్రిస్మస్ బరిలో బాద్షా.. విడుదల తేదీని ప్రకటించిన షారుఖ్ ఖాన్ ‘కింగ్’
Bhubharathi | భూభారతి అక్రమాలపై 48 మందిపై కేసు..9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలు