అమ్రాబాద్: తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన హేమంత్ నాయక్ అనే విద్యార్థి తన తండ్రి లక్యా నాయక్ గురువారం రాత్రి చనిపోయాడు. హేమంత్ బాధను దిగమింగుకొని పుట్టెడు దుఃఖంతో శుక్రవారం ఉదయం పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఒకపక్క తండ్రి చనిపోయినటువంటి బాధ ఇబ్బంది పెడుతున్నా.. కుటుంబ సభ్యులు, బంధువులు సూచన మేరకు శుక్రవారం జరిగిన బయోసైన్స్ పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియలో పాల్గొన్నాడు.
ఇవి కూడా చదవండి..
IPL 2025 | అనుకోకుండా ఐపీఎల్ ఛాన్స్.. మ్యాచ్ విన్నర్‌గా మారిన శార్ధూల్
Bela hospital | సర్కారులో సగం సగమే.. అరకొరగా వైద్యులు.. అందుబాటులో ఉండని మందులు