Samantha | టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు సినిమాలు కాస్త తగ్గించింది. మయోసైటిస్ బారిన పడినప్పటి నుండి కూడా సమంత తన పూర్తి దృష్టి ఆరోగ్యంపైనే పెడుతుంది. ఇక వీలున్నప్పుడల్లా విహర యాత్రలకి వెళుతూ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు సమంత ఆస్ట్రేలియా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఓ రోజంతా సరదాగా గడిపిన సామ్, ఆ అద్భుతమైన క్షణాలను కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో సమంత క్యాజువల్ డ్రెస్‌లో ఉన్నా మరింత క్యూట్‌గా కనిపిస్తుంది. అయితే సమంత అక్కడి అందమైన ప్రకృతిని , జంతువులని చూస్తూ చాలా మురిసిపోయింది.
ఆస్ట్రేలియా వెకేషన్ పిక్స్‌లో సమంత బూడిద రంగు ఫుల్ స్లీవ్ చొక్కా, నీలి రంగు జీన్స్ లో మెరిసింది. కౌబాయ్ క్యాప్ స్పెషల్ అట్రాక్షన్. ఇక తన పోస్ట్‌లో ప్రకృతి, జంతువులు, మంచి వైబ్స్! కంగారూలకు ఆహారం ఇవ్వడం నుంచి నిద్రపోతున్న కోలాల వరకు… ఇది చాలా ఆనందమైన సమయం! ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల కోసం వారు చేసే అద్భుతమైన పునరావాస పనులన్నింటికీ @featherdalewildlifepark బృందానికి అభినందనలు అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. అయితే సమంత పోస్ట్‌కి ఓ నెటిజన్ ఈ ఫొటోలను ఎవరూ తీశారని అడగగా, దానికి సిడ్నీ టూర్ గైడ్ నయోమి అని సమాధానం ఇచ్చింది. అంటే సమంత వెకేషన్ పిక్స్ తీసింది అక్కడి లోకల్ టూరిస్ట్ గైడ్ అని చెప్పుకొచ్చింది.
సమంత రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతనితో కలిసి ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిందేమొ అని నెటిజన్స్ బావిస్తున్నారు. ఇటీవల రాజ్‌తో ఎక్కువగా కనిపిస్తుంది సమంత. రీసెంట్గా ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని, అందుకు సాక్ష్యంగా ఓ డైమండ్ రింగ్ కూడా చూపించారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి గురించి జోరుగా ప్రచారాలు సాగుతున్నా ఇద్దరిలో ఎవరు స్పందించడం లేదు. ఇక సమంత తదుపరి చిత్రం రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రాజ్-డీకే దర్శకత్వంలోనే ‘రక్త్ బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ రూపొందుతుండగా, అందులోను సామ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సమంత స్వయంగా నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలోనూ ఆమె మెరిసి అలరించనుంది.