IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో శార్ధూల్ ఠాకూర్ (Shardhul Thakur) పేరు మార్మోగిపోతోంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో సూపర్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడీ పేసర్. పవర్ ప్లేలో వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు.. ఆపై ఆఖర్లో మరో రెండు ఖాతాలో వేసుకున్న అతడు మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. ఆడిన రెండు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు శార్ధూల్.
మూడు నెలల క్రితం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని.. ఈ ఆల్‌రౌండర్ అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో చేరాడు. తన సుదీర్ఘ అనుభవంతో జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు లార్డ్స్ శార్ధూల్.
Doing what he does best 👏 🔝
Shardul Thakur produces a special bowling spell to help #LSG clinch a BIG win and takes home the Player of the Match award 🫡
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL | @imShard pic.twitter.com/VDtFcq5zlp
— IndianPremierLeague (@IPL) March 27, 2025
టీమిండియాకు ఆడిన శార్థూల్ ఐపీఎల్లో చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ.. జట్లకు ఆడాడు. అయితే.. 18వ సీజన్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ తనను కొనకపోవడంతో ఐపీఎల్ అవకాశం చేజారింది అనుకున్నాడు. అలా అనీ దిగాలుగా ఉండిపోకుండా ఇంగ్లండ్ గడ్డపై కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడట. అయితే.. అనుకోకుండా లక్నో యాజమాన్యం ఈ పేసర్‌ను సంప్రదించింది.
‘మెగా వేలంలో ఎవరూ నన్ను కొననందుకు కొంచెం బాధ పడ్డాను. కొన్ని రోజులకు తేరుకొని కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాను. ఐపీఎల్ 18వ సీజన్ మొదలవ్వగానే లక్నో యాజమాన్యం నాతో మాట్లాడడం.. జట్టుతో కలవడం.. చకచకా జరిగిపోయాయి. రెండు మ్యాచుల్లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. అయితే.. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లు తయారు చేస్తున్నారు క్యూరేటర్లు. అలా కాకుండా బౌలర్లకు, బ్యాటర్లకు.. ఇద్దరికీ అనుకూలించే పిచ్‌లు రూపొందిస్తే బాగుంటుంది. ఇక ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనతో బౌలర్లు బలి అవుతున్నారు. 200, 240కి పైగా స్కోర్లు నమోదు అవుతున్నాయి. అందుకు బౌలర్లను నిందించడం సరైంది కాదు’ అని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న అనంతరం వెల్లడించాడు శార్ధూల్.
🚨 Milestone 🚨
Shardul Thakur enters the 100 wickets club in #TATAIPL 🙌
An impressive 4⃣/3⃣4⃣ tonight also earns him the Purple Cap! 👏
Updates ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL | @imShard pic.twitter.com/3NSIjmrbXC
— IndianPremierLeague (@IPL) March 27, 2025
గాయపడిన మొహ్సిన్ ఖాన్ స్థానంలో లక్నో జట్టులోకి వచ్చాడు శార్ధూల్. అతడితో రూ. 2 కోట్లకు ఒప్పందం చేసుకుంది ఫ్రాంచైజీ. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. తనది లక్కీ హ్యాండ్ అని నిరూపించుకున్నాడీ ఆల్‌రౌండర్. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై వికెట్లు తీసిన శార్థూల్.. సన్‌రైజర్స్‌పై రెచ్చిపోయాడు. తన రెండో ఓవర్లోనే డేంజరస్ అభిషేక్, ఇషాన్‌లను ఔట్ చేసి హైదరాబాద్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఆఖర్లో అభినవ్ మనోహర్, షమీలను పెవిలియన్ పంపి.. 34 పరుగులకే 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు శార్ధూల్.